బాబు మీరుకూడా ఇలాంటి వేషాలేస్తే ఎలా?

నాగబాబు ప్రస్తుతం ఏం చెయ్యాలో తెలియక.. కామెడీ షోస్ అంటూ కామెడీ చేస్తున్నాడు. జబర్దస్త్ లో కామెడీ షోకి జెడ్జి గా ఉన్నప్పుడు నాగబాబు అంటే చాలామందికి [more]

Update: 2020-07-18 06:20 GMT

నాగబాబు ప్రస్తుతం ఏం చెయ్యాలో తెలియక.. కామెడీ షోస్ అంటూ కామెడీ చేస్తున్నాడు. జబర్దస్త్ లో కామెడీ షోకి జెడ్జి గా ఉన్నప్పుడు నాగబాబు అంటే చాలామందికి రెస్పెక్ట్ ఉండేది. అయితే నాగబాబు జబర్దస్త్ ని వదిలేసి జీ ఛానల్ అదిరింది షో కి వెళ్ళాక నిజంగానే నాగబాబు కామెడీ అయ్యాడు. అదిరింది షోని లేపడానికి ఎంత ట్రై చేసినా నాగబాబు వల్ల కావడం లేదు. దాదాపుగా అదిరింది షో డిజాస్టర్ గా మిగిలిపోయి.. దుకాణం సర్దేస్తుందేమో అనే ఫీలింగ్ వచ్చేలోగా… నాగబాబు ఇప్పుడు తన ఓన్ యూట్యూబ్ ఛానల్ లో రెండు కామెడీ షోస్ ప్లాన్ చేసాడు. అయితే నాగబాబు జబర్దస్త్ లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ జనసేన కార్యక్రమాలలో కనిపించేవాడు. అప్పుడప్పుడు జనసేనపై మాట్లాడుతుండేవాడు. రోజా జబర్దస్త్ జేడ్జ్ అయినప్పటికీ.. ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రతో ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ నాగబాబు వల్ల మాత్రం అది అవ్వడం లేదు.

అయితే ఇప్పుడు జనసేన ఒక్క పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకెళ్లడం అంటే అయ్యే పనిలా లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరికీ ఛాన్స్ ఇవ్వడు. అలాగని జనసైనికులు జనసేనానిని వదల్లేరు.  మరోపక్క పవన్ జనసేనకు మీడియా మద్దతు లేదు. పవన్ ఏం మాట్లాడిన ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రతిపక్ష అనుకూల మీడియాలు ప్రచారంలోకి రానివ్వవు. మరోపక్క పవన్ కళ్యాణ్ జనసేనాని ప్రజలు మర్చిపోతారేమో అనే ఫీలింగ్ జనసేనలోనే కలుగుతుంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కి నాగబాబు వెన్నంటి ఉంటే బావుంటుంది. కానీ అదిరింది షోలో జేడ్జ్ గా చేసుకో ప్రాబ్లెమ్ లేదు. కానీ ఇలా కామెడి షోస్ ప్లాన్ చేసి.. వాళ్ళని ఒకతాటిపైకి తెచ్చి.. ఆ షో ని హ్యాండిల్ చెయ్యాలంటే కష్టం. ఇక జనసేనాని ఏం పట్టించుకుంటావ్ నాగబాబు అంటున్నారు జనసైనికులు. వాళ్ళన్నది కరెక్ట్. కాకపోతే నాగబాబు కి కూడా జనసేన మీద బోర్ అయినా కొట్టుండాలి. లేదంటే డబ్బు సంపాదన కోసమే అయినా అయ్యుండాలి.

Tags:    

Similar News