పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయలేదా.. త్వరగా చేయండి, లేకపోతే వేస్ట్

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. ఈ సారి 2023 మార్చి 31న..;

Update: 2022-12-10 11:57 GMT
Aadhar PAN card, income tax of india

Aadhar PAN card

  • whatsapp icon

మీ పాన్ కార్డుతో ఆధార్ ను అనుసంధానం చేశారా ? చేయకపోతే త్వరగా చేసుకోండి. లేకపోతే మీ పాన్ కార్డు పనిచేయదు. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఎన్నోమార్లు గడువు పొడిగించింది. ఈ సారి 2023 మార్చి 31న తుదిగడువుగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ లింక్ చేయకుంటే ఆధార్ పనిచేయదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆదాయ పన్నుశాఖ స్పష్టం చేసింది.

ఐటీ చట్టం-1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని వారు తప్పనిసరిగా పాన్ ను ఆధార్ తో.. అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ గడువు ముగియగా.. గడువు పొడిగించిన నేపథ్యంలో ఆలస్య రుసుం కింద రూ.1000 చెల్లించి పాన్ తో ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ లో ప్రకటన చేసింది.



Tags:    

Similar News