DGCA డేటా ప్రకారం జనవరి 2021- మార్చి 2022 మధ్య మద్యం పరీక్షల్లో 35 ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాల్లో 56 మంది కార్మికులు, నాలుగు అదానీ గ్రూప్‌స్ ద్వారా నడిచే విమానాశ్రయాల్లో 17 మంది కార్మికులు, రెండు GMR గ్రూప్స్ ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాల్లో తొమ్మిది మంది కార్మికులు, ఫెయిర్‌ఫాక్స్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే బెంగళూరు విమానాశ్రయంలో ఇద్దరు కార్మికులు మద్యం తాగి డ్యూటీ చేస్తూ దొరికిపోయారు. బెంగళూరు ఎయిర్ పోర్ట్ ఆపరేట్ చేస్తున్న సంస్థ మాత్రం ఆ ఇద్దరు తమ ఉద్యోగులు కాదని తేల్చి చెప్పింది. "బెంగళూరు విమానాశ్రయం (బిఐఎఎల్) 2021 నుండి తమ ఉద్యోగులు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో విఫలమైన సందర్భాలు ఏవీ లేవు" అని పేర్కొంది.
ఆల్కహాల్ పరీక్షల్లో విఫలమైన 56 మంది కార్మికుల గురించిన DGCA డేటా పై మాట్లాడుతూ.. జనవరి 2021- మార్చి 2022 మధ్య AAI ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాలలో 14- 18 మంది కార్మికులు మాత్రమే ఆల్కహాల్ పరీక్షలలో విఫలమయ్యారని AAI తన స్వంత డేటాను PTIతో పంచుకుంది. "BA (బ్రీతలైజర్) పరీక్షలో విఫలమైన 18 మంది కార్మికులలో, ముగ్గురు AAI కు చెందిన వారని.. మిగిలిన 15 మంది AAI కాంట్రాక్టు ఏజెన్సీలకు చెందినవారు," AAI తెలిపింది. మద్యం తాగి వచ్చిన కార్మికులపై ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి PTI ప్రశ్నలకు అదానీ గ్రూప్, GMR గ్రూప్ స్పందించలేదు.
గౌహతి, జైపూర్, లక్నో విమానాశ్రయాలను అదానీ గ్రూప్ నిర్వహిస్తోంది. DGCA డేటా ప్రకారం, ఈ మూడు విమానాశ్రయాల్లోని ఎనిమిది మంది కార్మికులు జనవరి 2021- మార్చి 2022 మధ్య ఆల్కహాల్ పరీక్షల్లో విఫలమయ్యారు. GMR గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ విమానాశ్రయంలో ఒక కార్మికుడు మాత్రమే జనవరి 2021- మార్చి 2022 మధ్య ఆల్కహాల్ పరీక్షలలో విఫలమయ్యాడని పేర్కొంది. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు, ఇతర సాంకేతిక శిక్షణ పొందిన వ్యక్తులు, ఇంధనం, ఇతర క్యాటరింగ్ వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు, పరికరాల ఆపరేటర్లు, ఏరోబ్రిడ్జ్ ఆపరేటర్లు, మార్షలర్లు, ఆప్రాన్ నియంత్రణ సిబ్బంది, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవల సిబ్బంది, ATC సిబ్బంది.. ఇలా పలువురు మద్యం మత్తులో ఉండడాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణిస్తూ ఉంటుంది. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలను సంబంధిత ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తాయి.