Five Rupees Coin : ఐదు రూపాయల నాణెం ఇక కనిపించవా? ఆర్బీఐ ఆ నిర్ణయం తీసుకుందా?
దేశంలో ఐదు రూపాయల నాణేన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
దేశంలో ఐదు రూపాయల నాణేన్ని నిలిపివేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పది రూపాయల నాణేల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పది రూపాయల నాణేన్ని ఎవరూ తీసుకోవడం లేదు. ఎందుకంటే అవి చెల్లవన్న ప్రచారం జోరుగా సాగడంతో చిరు వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ ఎవరూ పది రూపాయల నాణేన్ని తీసుకోవడం లేదు. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేక సార్లు ప్రకటనలు చేసింది.
ఆర్బీఐ పదే పదే చెప్పినా...
పది రూపాయల నాణెం చెల్లుతుందని ప్రకటించింది. అయినా ప్రజల్లో అనుమానాలు మాత్రం తొలగిపోవడం లేదు. ఇప్పుడు మళ్లీ ఐదు రూపాయల నాణెంపై కూడా అదేరకమైన ప్రచారం ప్రారంభమైంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐదు రూపాయల నాణేన్ని రద్దు చేస్తున్నట్లు ఎటువంటి ప్రకటన అధికారికంగా మాత్రం రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం పెద్దయెత్తున ప్రచారం జరుగుతుండటంతో ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఐదు రూపాయల నోట్లు మార్కెట్ లో ఎక్కువగా చెలామణి అవుతున్నాయి.
పది రూపాయల నోటు ఎక్కడ?
పది రూపాయల కరెన్సీ నోటు కూడా కొరత ఇటీవల కాలంంలో ఎక్కువగా ఉంది. ఇరవై రూపాయల నోటు దొరికినంత సులువుగా పది రూపాయల నోటు మార్కెట్ లో లభించడం లేదు. దీంతో దానిపై కూడా ముద్రణ ఏమైనా నిలిచిపోయిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో మరోసారి ఐదు రూపాయల నాణెం విషయంలో అదే రకమైన ప్రచారం జరిగుతోంది. ఐదు రూపాయల నాణేల ముద్రణను నిలిపి వేయాలని యోచిస్తున్నట్లు పెద్దయెత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోవడంతో దానిని నమ్మవద్దని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆర్బీఐ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ