నేడు కువైట్ కు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కువైట్ కు బయలుదేరి వెళుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు కువైట్ కు బయలుదేరి వెళుతున్నారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత ప్రధాని గల్ఫ్ దేశంలో పర్యటించడం ఇదే తొలిారి. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. భారత్ - కువైట్ మధ్య సత్సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలపడతాయని భావిస్తున్నారు.
రెండు రోజుల పర్యటనకు...
ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ లో ఉన్నతాధికారులు, పాలకులతో సమావేశమై సమీక్ష చేయనన్నారు. వివిధ అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో అక్కడ భారతీయ సంతతి సంఘాలతో కూడా మోదీ సమావేశం కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మోదీ కువైట్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now