బీహర్‌లో కుప్పకూలిన బ్రిడ్జి

బీహార్ లో పదమూడు కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన కుప్పకూలింది.

Update: 2022-12-19 06:59 GMT

బీహార్ లో పదమూడు కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన కుప్పకూలింది. ప్రారంభోత్సవానికి ముందే కూలడంతో కార్మికుడు మృతి చెందాడు. బెగుసరాయ్‌లో నిర్మించిన ఈ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. గండక్ నదిపై 206 మీటర్ల పొడవున వంతెన నిర్మించారు. దానికి యాక్సెస్ రోడ్డు లేకపోవడంతో వంతెన ప్రారంభించలేదు. వంతెన ముందు భాగంలో కొంత పగుళ్లు కనిపించడంతో స్థానికులు అధికారులకు లేఖ కూడా రాశారు.

వంతెన పూర్తయినా...
2017లో ఈ వంతెన పూర్తయింది. అయితే అధికారులు నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆకృతి టోలా చౌకి-బిషన్‌పూర్ మధ్య వంతెనను నిర్మించారు. అయితే దీనిపై నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.


Tags:    

Similar News