నేడు తేలనున్న ప్రియాంక గాంధీ భవితవ్యం
వాయనాడ్ లోక్ సభ స్థానం ఎన్నికకు కూడా నేడు లెక్కింపు జరగనుంది.తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేశారు
ఈరోజు వాయనాడ్ లోక్ సభ స్థానం ఎన్నికకు కూడా నేడు లెక్కింపు జరగనుంది. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో గెలుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజీనామాతో వాయనాడ్ కు ఉప ఎన్నికకు జరిగింది. ఈ ఎన్నికల్లో స్వయంగా ప్రియాంక గాంధీ పోటీ చేశారు.
వాయనాడ్ ఉప ఎన్నికకు...
అయితే ఇక్కడ బీజేపీతో పాటు కమ్యునిస్టు పార్టీల అభ్యర్థులు కూడా పోటీ చేశారు. అయితే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాయనాడ్ లో పోటీ చేశారు. ఈఎన్నికల్లో గెలిచి ఆమె పార్లమెంటులో అడుగు పెట్టాలని భావిస్తున్నారు. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ప్రియాంక గాంధీ గెలిచి గాంధీ కుటుంబం నుంచి మరొకరు చట్ట సభల్లోకి ప్రవేశిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.