Maharashtra Election Result : నేడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 26వ తేదీతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రెండు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. కౌంటింగ్ కు సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా భారీగా భద్రతాదళాలను మొహరించారు.
జార్ఖండ్ లోనూ నేడు...
మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి ఏర్పడుతుందా? లేక కాంగ్రెస్ కూటమితో కూడిన ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్నది ఈరోజు తేలిపోనుంది. దీంతో పాటు జార్ఖండ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ రెండు విడతల్లో ఈ నెల 13, 20 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా ఇండి కూటమి, ఎన్డీఏ కూటమి పోటీ పడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి వస్తుందని అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి. మరి ఈరోజు ఫలితాల్లో ఏ పార్టీ అధికారం వస్తుందన్నది చూడాల్సి ఉంది.