ప్రైమరీ స్కూల్స్ కు ఇక ఆన్ లైన్ లోనే క్లాసులు!!

5వ తరగతి లోపు విద్యార్థులు స్కూల్స్ కు రానక్కర్లేదని

Update: 2024-11-14 16:55 GMT

ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్ర స్థాయికి దిగజారుతోంది. దీంతో 5వ తరగతి లోపు విద్యార్థులు స్కూల్స్ కు రానక్కర్లేదని ప్రభుత్వం తెలిపింది. ఐదవ తరగతి లోపు అన్ని తరగతులను ఇకపై ఆన్ లైన్ లో మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న కాలుష్య స్థాయిల కారణంగా, ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఎక్స్‌లో రాశారు. ప్రాథమిక తరగతులను మూసివేస్తూ విద్యా డైరెక్టరేట్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE), MCD, NDMC, DCBలకు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల అధిపతులకు సూచనలు పంపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ లో తరగతులు ఉండేలా చూడాలని ఆర్డర్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపి) స్టేజ్ 3 కింద నిబంధనలు విధించిన నేపథ్యంలో తరగతులను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ చర్యలలో భాగంగా నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలపై నిషేధం, ఢిల్లీలోకి వాహనాల ప్రవేశంపై పరిమితులు విధించారు.


Tags:    

Similar News