నేడు అఖిలపక్ష సమావేశం.. కీలక అంశాలపై చర్చ

పార్లమెంటు శీతాకాలం సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు అఖలపక్ష సమావేశం జరుగుతుంది

Update: 2024-11-24 04:25 GMT

ఇవాళ ఉదయం పదకొండు గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు ఈ భేటీ జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజుజు ఆధ్వర్యంలో అఖిల పక్షం భేటీ కానుంది. రేపటి నుంచి డిసెంబర్‌ 20వ తేదీ వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. శీతాకాల సమావేశాల్లో వివిధ పక్షాల నేతల అభిప్రాయాలపై అఖిలపక్షం సమావేశంలో స్వీకరిస్తారు.

ఇదీ అజెండా...
ఒకే దేశం- ఒకే ఎన్నిక, వక్ఫ్‌ బిల్లులకు చట్టరూపం ఇవ్వాలనే సంకల్పంతో మోడీ సర్కార్ ఉంది. ఈ సమావేశాల్లో ఈ రెండు బిల్లులను ఆమోదింప చేసుకోవాలని మోడీ ప్రభుత్వం చూస్తుంది. ఈ రెండు బిల్లులను కాంగ్రెస నేతృత్వంలోని ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతం పార్టమెంటరీ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లు-2024. ఒకేదేశం-ఒకే ఎన్నిక బిల్లు.. లోక్‌ సభో అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు వంటి అంశాలలో మద్దతు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో కోరనున్నారర.


Tags:    

Similar News