ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.;

Update: 2024-05-28 03:30 GMT
air india flight, landed, safely,  trichy airport
  • whatsapp icon

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు నిర్వహించారు. విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే అత్యవసరం ద్వారం ద్వారా ప్రయాణికులను సిబ్బంది దించి వేశారు. దీంతో ప్రయాణికులకు కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

బాంబ్ స్క్కాడ్ తో....
అయితే బాంబు ఉందని కాల్ రావడంతో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి విమానంలో బాంబు లేదని తేల్చారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఆకతాయిల పనిగా విమానాశ్రయ సిబ్బంది భావిస్తున్నారు. బాంబు బెదిరింపుతో ప్రయాణ సమయం ఆలస్యమయిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News