భారత్ లో మరో ఒమిక్రాన్ కేసు

భారత్ లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదయింది. గుజరాత్ లో బయటపడింది.

Update: 2021-12-04 09:06 GMT

భారత్ లో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదయింది. గుజరాత్ లో బయటపడింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు కేసులు బయటపడటంతో ఆ రాష్ట్రం అప్రమత్తమయింది. కర్ణాటకలో ఆంక్షలను కఠినతరం చేశారు. విదేశాల నుంచి వచ్చే మొత్తం ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్ లో ఇప్పటి వరకూ మూడు ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.

38 దేశాలకు...
ఒమిక్రాన్ వేరియంట్ తో దాదాపు ప్రపంచ దేశాలన్నీ గడగడలాడిపోతున్నాయి. దాదాపు 12 దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. అయినా ఒమిక్రాన్ వేరియంట్ 38 దేశాలకు ఇప్పటికే పాకింది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నా ఒమిక్రాన్ వేరియంట్ మరింత విస్తరించే అవకాశముందంటున్నారు.


Tags:    

Similar News