సారీ చెప్పిన రాందేవ్
మహిళలకు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు;

మహిళలకు బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. మహిళల దుస్తులపై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహిళ సంఘాలు రాందేవ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టాయి.
బహిరంగ లేఖ ద్వారా...
మహారాష్ట్ర మహిళ కమిషన్ బాబా రాందేవ్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో బాబా రాందేవ్ మహిళలకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖను విడుదల చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.