నేడు కూడా రైతు సంఘాలతో చర్చలు

రైతు సంఘాలు ఇచ్చిన బంద్ ఉత్తర భారతదేశంలో కొనసాగుతుంది. ఉద్రిక్తతల మధ్య రైతులు బంద్ చేస్తున్నారు

Update: 2024-02-16 03:55 GMT

రైతు సంఘాలు ఇచ్చిన బంద్ ఉత్తర భారతదేశంలో కొనసాగుతుంది. ఉద్రిక్తతల మధ్య రైతులు బంద్ చేస్తున్నారు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం భారత్ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేయడం తప్ప పరిష్కారం చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిన్న ఛండీగఢ్ లో రైతు సంఘాల ప్రతినిధులు, ముగ్గురు కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు అసంతృప్తిగానే ముగిశాయి.

డిమాండ్ల పరిష్కారానికి...
మరోసారి ఈరోజు రైతు సంఘాల నేతలతో ఛండీగఢ్ లో ప్రభుత్వం చర్చలకు సిద్దమవుతుంది. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు ఉత్పత్తి చేసే పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని, గత ఆందోళనలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఆందోళనకు దిగారు. శంభూ ప్రాంతంలో మొహరించిన రైతులు అక్కడే కూర్చున్నారు. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా నుంచి వచ్చిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఢిల్లీలో ట్రాఫిక్ స్థంభించింది.


Tags:    

Similar News