Black leopard : ఇదిగో... నల్ల చిరుత ... అసలు నిజమిదే
తొలిసారి నల్ల చిరుత కెమెరా కంట పడింది. ఒడిశాలోని నయాగడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను అటవీ అధికారులు గుర్తించారు;
తొలిసారి నల్ల చిరుత కెమెరా కంట పడింది. ఒడిశాలోని నయాగడ్ జిల్లా అటవీ ప్రాంతంలో ఓ అరుదైన నల్ల చిరుతను అటవీ అధికారులు గుర్తించారు. ఒక నల్లని చిరుతపులి తనకు పుట్టిన చిరుత కూనను నోట కరుచుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ అటవీ శాఖ అధికారుల ట్రాప్ కెమెరాలకు చిక్కడం కనిపించింది. అడవిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ఈ నల్ల చిరుత చిక్కడంతో అటవీ శాఖ అధికారులే ఆశ్చర్యపోయారు.
అటవీ శాఖ అధికారులు మాత్రం..
అయితే ఇది సాధారణ చిరుతపులి అని, మెలనిజం అనే జన్యు లోపం కారణంగా నల్లగా మారిందని, ఇది ప్రత్యేకమైన జాతి కాదని అటవీ శాఖ అధికారులు తేల్చారు. ఈ జన్యులోపంతో ఉన్న జంతువులు ఒడిశాలోని మూడు అటవీ డివిజన్లలో ఉన్నాయని నిర్ధారించారు. ఇవి జన్యులోపంతో ఉన్నప్పటికీ వీటికి పుట్టే పులికూనలు మాత్రం సాధారణంగానే ఉంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ చిరుత పులి.. తనకు పుట్టిన ఈ కూనను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మార్చే సమ యంలో ట్రాప్ కెమెరాలకు చిక్కిందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now