Breaking : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన ఈసీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది;

Update: 2025-01-07 09:14 GMT

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 10 వతేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. వచ్చే నెల 5వ తేదీన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఒకే విడత ఎన్నికలు జరుతాయని తెలిపారు.జనవరి పదిహేడో తేదీ నామినేషన్లకు ఆఖరి గడువు.   ఢిల్లీలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉంటారని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది తొలిగా ఢిల్లీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా తమకు సహకరించాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఓట్ల తొలిగింపు ప్రచారంలో వాస్తవం లేదని రాజీవ్ కుమార్ తెలిపారు. గత ఏడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఆయన చెప్పారు. ఓటర్ల లిస్ట్ లో ట్యాంపరింగ్ జరిగిందన్నది కూడా అవాస్తమని అన్నారు. ఈవీఎంలతోనే పారదర్శకంగా ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.

వచ్చే నెల 23వ తేదీ తో...
వచ్చే నెల 23తో ఢిల్లీ శాసనసభ పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం డెబ్భయి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాల్లో విజయం సాధించాలి. ఢిల్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో తలపడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కూడా వెళ్లాయి. అన్ని పార్టీలూ హామీలు గుప్పిస్తున్నాయి. ఉచిత హామీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు మూడు పార్టీలూ సిద్ధమయ్యాయి.


Tags:    

Similar News