భారత్ లో ఆరుకు చేరిన హెచ్ఎంపీవీ కేసులు
భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఆరు కి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది.;
భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. ఆరు కి చేరడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్ చేసింది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. బెంగళూరులో తొలి రెండు కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో అవసరమైన అన్ని చర్యలు ప్రారంభించారు.
రాష్ట్రాలు అప్రమత్తం...
కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. హెచ్ఎంపీవీ కేసులో భారత ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులతో సంప్రదింపులు జరుపుతుంది. చైనాలో ఇప్పటికే అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించారు. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, దద్దుర్లు లక్షణాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now