Delhi :నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా నేడు మోగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్ ను విడుదల చేయనుంది;
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా నేడు మోగనుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్ ను విడుదల చేయనుంది. ఢిల్లీ శాసనసభకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ మధ్యాహ్నం రెండు గంటలకు వెల్లడించనుంది. ఇప్పటికే అన్ని పార్టీలూ ఢిల్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. ఆమ్ ఆద్మీపార్టీ అయితే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
70 స్థానాలకు...
బీజేపీ తొలి జాబితాలో 29 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గత కొన్ని రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఢిల్లీలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించారు. 70 స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో విజయం కోసం ఆమ్ ఆద్మీపార్టీ, కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ