Sabarimala: కిటకిటలాడుతున్న శబరిమల.. క్యూలైన్ ఎంత పొడవంటే?
శబరిమలకు ఒక్కసారిగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు;
శబరిమలకు ఒక్కసారిగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. అయ్యప్పస్వామి దర్శనానికి పది గంటల సమయం పడుతుందని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేశామని, టోకెన్లు పొందిన భక్తులకు ముందు దర్శనం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.
24 గంటల్లో లక్ష మంది...
నిన్న ఒక్కరోజే ఇరవై నాలుగు గంటల్లో లక్ష మంది వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. ఈనెల 14వ తేదీ వరకూ అయ్యప్ప ఆలయం తెరిచి ఉండటం, సమయం దగ్గరపడుతుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. టోకెన్లు ఇరవై వేల వరకూ మంజూరు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now