నైట్ కర్ఫ్యూ పెడితే బెటరేమో... రాష్ట్రాలకు కేంద్రం సూచన
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు సూచనలు చేసింది
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్రాలకు కోవిడ్ కట్టడికి కొన్ని సూచనలు చేసింది. కరోనా దేశంలో ప్రస్తుతం అదుపులో ఉంది. అయినా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించడం మేలన్న సూచనను కేంద్ర ప్రభుత్వం చేసింది.
పరిమిత ఆంక్షలతో....
నైట్ కర్ఫ్యూ పై ఆలోచించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నైట్ కర్ఫ్యూలతో పాటు కొన్ని పరిమితమైన ఆంక్షలు విధిస్తే మేలని అభిప్రాయపడింది. పది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కరోనా పాజిటివ్ రేటు పెరుగుతుందని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.