కేంద్రం వార్నింగ్... ఐదింటిలో తెలంగాణ కూడా?

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది

Update: 2022-06-04 02:38 GMT

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు ఈ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న ఒక్కరోజే నాలుగువేలకు పైగా కేసులు నమోదవ్వడంతో కేంద్రం అలెర్ట్ అయింది.

కరోనా కట్టడికి....
కరోనా కట్టడి కి చర్యలు తీసుకోవాలని ఈ ఐదు రాష్ట్రాలకు తెలిపింది. కరోనా నిబంధనలను పాటించడం, మాస్క్ లు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఈ నిషేధాజ్ఞలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపింది. వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలను హెచ్చరించింది.


Tags:    

Similar News