నేడు చీఫ్ జస్టిస్ గా పదవీ విరమణ
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసే చివరి రోజున ఐదు కేసులను విచారించారు.
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసే చివరి రోజున ఐదు కేసులను విచారించారు. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు పై తదుపరి చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ కేసును మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఇక 2013లో బాలాజీ సుబ్రహ్మణ్యం కేసులో వెలువడిన తీర్పును పునః పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఆమోదించింది.
ఉచిత హామీలపై...
అలాగే రాజకీయ పార్టీల ఉచిత హామీల అమలు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈరోజు తొలిసారి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ను ప్రతక్ష ప్రసారం చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆయన చేసిన సేవలను కొనియాడారు.