ఏందయ్యా సామీ కోటి రూపాయల జీతం ఇంత తేలిగ్గా వదిలేశావూ?

బెంగళూరులో వరుణ్ ఒక పెద్ద కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. నెలకు ఎనిమిది లక్షల రూపాయల జీతం

Update: 2024-12-21 03:54 GMT

డబ్బు ఎవరికి చేదు అన్నది పాత సామెత. అవును చేదే అన్నది నేటి తరం నిరూపిస్తుంది. జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదని, మనశ్శాంతి, ఆనందరం కూడా అంతే ముఖ్యమని యువత భావించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉరుకులు, పరుగుల జీవితం, జీతం భారీగా వస్తున్నా ఆనందం లేని సమయం ఇట్టే గడిచిపోతుంది. మొహంలో నవ్వులేదు. పాడు లేదు. యాంత్రికంగా పనిచేయడమే. యంత్రంలా కరెన్సీ మిషన్ లా డబ్బు సంపాదించడం ఒక్కటే జీవితమా? అని తమను తాము ప్రశ్నించుకునే రోజులొచ్చాయి. హ్యాపీ మూమెంట్ లేదు. క్షణం తీరిక లేదు. అలాగని కుటుంబంతో గడుపుతున్నామా? అంటే అదీ లేదు. ఎందుకీ జీతం? ఎందుకీ జీవితం? అని తనను తానే ప్రశ్నించుకుని ఏడాదికి కోటి రూపాయల జీతాన్ని అలవొకగా వదిలేసుకున్నాడు ఓ యువకుడు.


ఇంజినీర్ గా పనిచేస్తూ...

బెంగళూరులో వరుణ్ ఒక పెద్ద కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. నెలకు ఎనిమిది లక్షల రూపాయల జీతం. అంటే ఇంకేముంది? అంతకు మించి ఆనందం ఏమిటనుకుంటున్నారా? కానీ వరుణ్ కు ఆనందం లేదు. క్షణం తీరిక లేదు. ఎప్పుడూ బిజీనే. నిత్యం ఆఫీస్ కార్యక్రమాలే. కుటుంబంతో గడిపింది లేదు. అందుకేు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఉద్యోగం వదిలేయాలని భావించాడు. తనకు మానసిక ప్రశాంతత లేని ఈ డబ్బుతనకు వద్దని వరుణ్ భావించాడు. అంతే ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. అందరూ నివ్వెర పోయారు. పిచ్చోడిని చూసినట్లు చూశారు. కానీ వరుణ్ మాత్రం పిచ్చి నవ్వు నవ్వి ఇందులో ఉన్న ప్రశాంతత మరేంటి ఏదన్నాడు.
ఆనందం లేని జీవితం...
తాను ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నా ఆనందం లేని జీవితం ఎందుకని ప్రశ్నించాడు. జీవితం ఉన్నది ఆనందపడటానికేనని తన సన్నిహితులకు చెప్పాడు. తన భార్య మోక్షద అభిప్రాయాన్ని కూడా తీసుకున్నాడు. వరుణ్ చెప్పిన దానితో ఆమె కూడా ఏకీభవించింది. ఉద్యోగం మానేస్తే వచ్చే డబ్బుతో ఏడాది పాటు సుఖంగా జీవించవచ్చని లెక్కలు వేశాడు. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చులే అని తనను తాను నచ్చ చెప్పుకున్నాడు. గడిచి పోయిన రోజులు ఇక తిరిగి రావని, కుటుంబ సభ్యులతో కలిసి లాంగ్ ట్రిప్ లు వేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి అవసరమైన సొమ్ములు ఏడాది వరకూ సరిపోతాయని భావించిన వరుణ్ ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి పారేశాడు. ఏడాది తర్వాత ఏదొక వ్యాపారం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకోవచ్చన్న ఆత్మవిశ్వాసంతో వరుణ్ కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. వరుణ్ నిర్ణయాన్ని అనేక మంది యువకులు నెట్టింట అభినందనలు తెలియ చేస్తున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News