గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లను విక్రయించే కంపెనీలు సిలిండర్ ధరను మరింత తగ్గించాయి. తాజాగా జూన్‌ 1న..

Update: 2023-06-01 05:21 GMT

ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేసుకుంటాయి. గత నెలలో రెండు వేల నోట్ల రద్దు ప్రభావం దీనిపై పడుతుందని సామాన్యులు ఆందోళన చెందారు. కానీ.. చమురు సంస్థలు శుభవార్త చెప్పాయి. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్లను విక్రయించే కంపెనీలు సిలిండర్ ధరను మరింత తగ్గించాయి. తాజాగా జూన్‌ 1న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే తగ్గిన సిలిండర్ ధరలు కమర్షియల్ వినియోగదారులకే వర్తిస్తాయి.

గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో మార్పులు లేవు. గత నెల అంటే మే 1వ తేదీన ఇదే సిలిండర్‌ ధరపై రూ.172 తగ్గింది. తాజాగా తగ్గిన ధరలతో.. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.83.5 తగ్గి ప్రస్తుతం రూ.1773కు చేరుకుంది. గత నెలలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1856.50 ఉండేది. ఈ సమయంలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1103 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 1960.50 ఉండగా, తగ్గింపు తర్వాత రూ.1875.50కి చేరింది. ముంబైలో రూ.1808.5 నుంచి రూ.1725కి తగ్గింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2021.50 నుంచి రూ.1937కు చేరింది.


Tags:    

Similar News