ఈనెల 23 నుంచి బ్యాంకు ఉద్యోగుల సమ్మె
ఈ నెల 23 నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ సమ్మె చేయనున్నారు.;

ఈ నెల 23 నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ సమ్మె చేయనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని యూనియన్ నేతలు తెలిపారు. బ్యాకింగ్ రంగం పెరుగుతున్నప్పటికీ అందుకు తగినట్లుగా నియామకం చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతుందని ఈ సమ్మెకు దిగుతున్నారు.
పదేళ్ల కాలంలో...
గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దేశ వ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారని, అయితే అందుకు తగినట్లుగా నియామకాలు చేయడం లేదని బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు ఆరోపిస్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మూడు రోజుల సాటు సమ్మెకు దిగుగున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు.