ఒక్క ఓటుతో పెద్ద పదవిని కోల్పోయిన మాకెన్
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఓటమి పాలయ్యారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ వేయడం కారణం
రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క ఓటుతో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఓటమి పాలయ్యారు. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్ వేయడం కారణం. అందుకే తక్షణం ఆ ఎమ్మెల్యేపై బహిష్కరణ వేటు వేసింది. కాంగ్రెస్. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. తన ఓటును బీజేపీ అభ్యర్థికి వేసినట్లు ఆయనే ట్విట్టర్ లో పేర్కొన్నడం విశేషం.
క్రాస్ ఓటింగ్...
దీంతో కుల్దీప్ బిష్ణోయ్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస అభ్యర్థిగా బరిలోకి దిగిన అజయ్ మాకెన్ ఓటమికి ఈ ఓటు కారణమయింది. 31 ఓట్లు రావాల్సి ఉండగా అజయ్ మాకెన్ కు 30 ఓట్లుమాత్రమే వచ్చాయి. బీజేపీ పోటీ చేయించిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయకు కుల్దీప్ బిష్ణోయ్ ఓటు వేయడంతో ఆయన విజయం సాధించారు. విషయం తెలిసిన వెంటనే సోనియా గాంధీ బిష్ణోయ్ ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించారని పార్టీ వర్గాలు చెప్పారు. 31 ఓట్లు సాధించిన కార్తికేయ విజయం సాధించడంతో అజయ్ మాకెన్ పెద్దల సభకు వెళ్లలేకపోయారు.