Rahul Gandhi : నేడు భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించనున్నారు.;

congress supremo rahul gandhi will soon start the bharat jodo nyaya yatra
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించనున్నారు. మణిపూర్ లో ఈ యాత్రను ప్రారంభిస్తారు. మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ముంబయితో ముగియనుంది. మొత్తం ఆరు వేల కిలోమీటర్ల మీర రాహుల్ గాంధీ ఈ యాత్ర చేయనున్నారు. రెండు నెలల పాటు జరిగే యాత్ర కొన్ని కిలోమీటర్లు పాదయాత్రగా, మరికొన్ని కిలోమీటర్లు బస్సులోనూ చేయనున్నారు.
మణిపూర్ నుంచి...
మధ్యాహ్నం పన్నెండు గంటలకు మణిపూర్ లోని ఖోంగ్‌జోమ్ వార్ మెమోరియల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు ఈ యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నారు. ఏఐసీీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేపట్టారు.