కూలీ కొడుక్కి 2.5 కోట్ల స్కాలర్‌షిప్

కూలీ కొడుకు ప్రేమ్ విద్యలో రాణించారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోసం 2.5 కోట్ల స్కాలర్ షిప్ ను సాధించాడు.

Update: 2022-07-10 05:25 GMT

చదువుకు ఆర్థికపరిస్థితి ఆటంకం కాదు. బాగా చదువుకుంటే ఆర్థికంగా ఎంత దీన స్థితిలో ఉన్నా వారి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. బీహార్ రాష్ట్రం అంటేనే వెనుకబడిన ప్రాంతం. చదువుకునే వారికంటే కూలీలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. పేదరికం కూడా అధికమే. అయితేనేం ఒక కూలీ కొడుకు ప్రేమ్ విద్యలో రాణించారు. అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోసం 2.5 కోట్ల స్కాలర్ షిప్ ను సాధించాడు. ప్రపంచంలో ఆరుగురికి ఈ స్కాలర్‌షిప్ దొరకగా అందులో ప్రేమ్ ఒకడు కావడం విశేషం.

అమెరికా యూనివర్సిటీలో...
పాట్నాకు సమీపంలోని గోన్పురాకు చెందిన ప్రేమ్ అమెరికాలోని పెన్సిల్వేనియాలోని లాఫాయేట్ కళాశాలో నాలుగేళ్ల పాటు మెకానికల్ ఇంజినీరింగ్ చదివేందుకు ఈ స్కాలర్‌షిప్ ప్రేమ్ కు లభించింది. అమెరికాలోని టాప్ 25 కళాశాలల్లో ఈ కళశాల ఒకటని ప్రేమ్ తెలిపారు. ప్రేమ్ తల్లి పదేళ్ల క్రితం మరణించింది. తండ్రి కూలీగా పనిచేస్తున్నారు.


Tags:    

Similar News