తమిళనాడులో అలర్ట్.. పెరుగుతున్న కేసులు
తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది
తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. ఒక్కరోజులోనే తమిళనాడులో 76 కేసులు నమోదవ్వడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రంలో తమిళానాడు కూడా ఒకటి. H3N2 కేసుల సంఖ్య కూడా ఎక్కువగా తమిళనాడులో నమోదవుతున్నట్లు గుర్తించారు.
కొత్త వేరియంట్...
మరోవైపు దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ వచ్చిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరిస్తే మేలు అని వైద్యులు సూచిస్తును్నారు. ఇండియాలోకి SARSCOV2 (కొవిడ్), కొత్త వేరియంట్ XBB1.16 (అర్క్యూటస్ ) ప్రవేశించిన క్రమంలో ట్విటర్ వేదికగా వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. 'కోవిడ్ కొత్త వేరియంట్ తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెబుతున్నారు. భయాందోళన చెందాల్సిన పనిలేదు. కానీ, ఇండోర్ క్లోజ్డ్ రూమ్ లో గుమికూడినప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.