రేపు కరోనా అలర్ట్ సమావేశం
కరోనా కేసులు కొన్ని రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమయింది.
కరోనా కేసులు గత కొన్ని రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమయింది. రేపు ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై అప్రమత్తం చేయనున్నారు. వరసగా పెరుగుతున్న కేసులతో ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు పాటించడంపై రేపు సమావేశం ప్రధానంగా జరుగుతుందని చెబుతున్నారు.
జాగ్రత్తగా ఉండాల్సిందే...
కరోనా కేసుల పెరుగుదల గత వారం రోజులుగా ఎక్కువగా ఉంది. దేశంలో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నిన్న 1500 కరోనా కేసులు నమోదయ్యాయి ఇది ఒమిక్రాన్ XBB.1.16 వేరియంట్‌లో ఉండే అవకాశం ఉందని గంగారం ఆసుపత్రి సీనియర్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలిపారు. చిన్న పిల్లలు, వృద్ధులతో పాటు దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.