దేశంలో పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Update: 2023-03-22 04:43 GMT

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనా కారణంగా మరణించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరు రాష్ట్రాలకు కోవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరడం ఆందోళన కలిగిస్తుంది.

కొన్ని రాష్ట్రాల్లో....
ట్రేస్, టెస్ట్, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు అందాయి. దీంతో కొన్ని రాష్ట్రాల్లో అప్రమత్తం చేశారు. వైరస్ కేసులు పెరుగుతున్నాయని, ఎవరూ మాస్క్ లేకుండా బయటకు రావద్దని కూడా ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. అయితే పెద్ద స్థాయిలో పెరగకపోవడంతో ముందుగానే అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.


Tags:    

Similar News