భారత్ లో 36కు చేరిన ఒమిక్రాన్ కేసులు

కరోనా కొత్త వేరియంట్ గా దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

Update: 2021-12-12 13:03 GMT

కరోనా కొత్త వేరియంట్ గా దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇటు భారత్ లోనూ ఒమిక్రాన్ కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా భారత్ లో మరో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో.. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 36కి చేరింది. ఛండీగఢ్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన 20 ఏళ్ల యువకుడికి ఒమిక్రాన్ నిర్థారణ అయింది. అలాగే కర్ణాటకలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణవ్వగా.. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కి చేరింది.

ఏపీలోనూ...
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవల ఐర్లాండ్ నుంచి విజయనగరం జిల్లాకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. తిరుపతిలో మరో వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనా దేశంలో ఒమిక్రాన్ విజృంభణ మొదలైంది. 2019 డిసెంబర్ లో చైనా లో మొదలైన కరోనా.. 2020 ఫిబ్రవరి వచ్చే సరికి భారత్ లోకి ఎంటరై.. కొన్నివేల మంది ప్రాణాలను బలితీసుకుంది. చూస్తుంటే.. 2022 కొత్త సంవత్సరంలో ఒమిక్రాన్ మరింత తీవ్రతరమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News