ఇవేం కేసులురా బాబూ..!

భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 6,050 కేసులు నమోదయ్యాయి.

Update: 2023-04-08 06:22 GMT

భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 6,050 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఏడు నెలల తర్వాత ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తం 14 మంది మరణించడం కూడా ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక,రాజస్థాన్ లో ఇద్దరు, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, కేరళలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ఎల్లుండి మాక్ డ్రిల్...
దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కోవిడ్ సంఖ్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో నిబంధనలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10, 11 తేదీల్లో మాక్ డ్రిల్ ను నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు శానిటైజర్లను కూడా వినియోగించాలని తెలిపింది. లేకుంటే కోవిడ్ సంఖ్యలు మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు కూడా సహకరించాలని కోరింది.


Tags:    

Similar News