కొంచెం తగ్గినట్లు కనిపించినా...?
దేశంలో కరోనా కేసులు నమోదవుతుండటం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,357 కొత్త కేసులు నమోదయ్యాయి
దేశంలో కరోనా కేసులు నమోదవుతుండటం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5,357 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది ఒక్కరోజులోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే మొన్నటి మీద నిన్న కరోనా కేసుల సంఖ్య తగ్గుతుంది. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లలో మరణాలు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
11 మంది మరణం...
దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,30,965 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 4,47,56,616 మందికి కరోనా సోకింది. వీరిలో 4,41,92,837 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ శాతం 98.74 శాతంగా నమోదయింది.