దేశంలో పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. తొలుత వెయ్యి, ఆ తర్వాత రెండు వేలు, ఈరోజు మూడు వేలకు కరోనా వైరస్ కేసులు చేరుకున్నాయి. దేశంలో ఈరోజు 3,016 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కరోనా కేసులు పెరిగాయని చెప్పింది.
యాక్టివ్ కేసుల సంఖ్య...
యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 13,509 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.78 శాతంగా నమోదయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతానికి చేరడం ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ఒక్కరోజు 14 మంది కరోనా కారణంగా మరణించడం మరింత ఆందోళన వైపు నెడుతుంది. ఒక్క కేరళలోనే ఏడుగురు మరణించారు. ఢిల్లీలోనే 300 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం అత్యవసరంగా ఈరోజు సమావేశమవుతుంది.