Kejrival : సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్.. హైకోర్టులో చుక్కెదురుకావడంతో
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ అక్రమమంటూ హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తన అరెస్ట్ అక్రమమంటూ హైకోర్టుకు వెళ్లినా అక్కడ ఊరట దక్కలేదు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ...
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనేక మంది అరెస్టయ్యారు. ఈకేసులో కొందరు అరెస్టయి అప్రూవర్ గా మారారు. బెయిల్ పై కొందరు బయటకు వచ్చారు. తనను రాజకీయంగా అణిచివేసేందుకు, లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపును ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకే ఈడీ అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ పిటీషన్ లో పేర్కొన్నారు.