సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గనున్న వంటనూనెల ధరలు
ఫార్చ్యూన్, జెమినీ బ్రాండ్ల వంటనూనెల ధరలు తగ్గనున్నాయి. ఫార్చ్యూన్ బ్రాండ్ తో వంటనూనెలను విక్రయిస్తున్న
ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం కారణంగా.. దాదాపు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వాటిలో ప్రతినిత్యం వాడే వస్తువుల ధరలు అధికంగా పెరిగాయి. వంటనూనెల ధరలపై ఒకేసారి రూ.15-20 వరకూ పెరిగింది. అయితే పెరిగిన వంటనూనెల ధరల నుండి సామాన్యులకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు వంటనూనెల ధరలను తగ్గించనున్నాయి.
ఫార్చ్యూన్, జెమినీ బ్రాండ్ల వంటనూనెల ధరలు తగ్గనున్నాయి. ఫార్చ్యూన్ బ్రాండ్ తో వంటనూనెలను విక్రయిస్తున్న అదానీ విల్మార్ లీటరుకు రూ.5 తగ్గించనుంది. అలాగే జెమిని ఎడిబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లీటరుకు రూ.10 తగ్గించేందుకు నిరర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు మూడు వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని ఆయా కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు.
గడిచిన 60 రోజుల్లో అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్ ధరలు తగ్గాయి. వేరుశెనగ, సోయాబీన్, ఆవాలు పంటలు కూడా బాగా ఉత్పత్తి కావడంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గాయి. తగ్గిన రేట్లతో దిగుమతి చేసుకుంటున్న భారత్.. అమ్మకాల్లో మాత్రం ధరలు తగ్గించలేదు.