26న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం
ఈ నెల 25న మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక జరగనుంది. 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు
ఈ నెల 25న మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక జరగనుంది. మహాయుత కూటమి మహారాష్ట్రలో దాదాపుగా విజయం సాధించినట్లే.215 స్థానాల్లో మహారాష్ట్రలో మహాయుత కూటమి ముందంజలో ఉంది. అయితే ముఖ్యమంత్రిపై ఎల్లుండి స్పష్టత రానుంది. మహాయుత కూటమిలో అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అందుకే సహజంగా బీజేపీ ముఖ్యమంత్రి పదవిని కోరే అవకాశముంది. 72 గంటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉండటంతో వేగంగా ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది.
షిండే వ్యాఖ్యలు...
అదే సమయంలో సీట్ల సంఖ్య ముఖ్యం కాదని మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాధ్ షిండే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సంచలనంగా మారాయి. ఎన్నికలప్రచారంలో భాగంగా మహాయుత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఏక్ నాధ్ షిండే కూడా మరోసారి సీఎం పదవిని కోరుకుంటారు. మరి బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకునే నిర్ణయంపైనే ముఖ్యమంత్రి ఎవరన్నది స్పష్టమవుతుంది. ఇప్పటికే మహారాష్ట్ర బీజేపీ నేతలు దేవంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలంటున్నారు. ఈ నెల 26న నూతన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.