రూపాయి వత్తిడి తప్పదేమో : ఆర్థిక సర్వే
పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 -23 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు
పార్లమెంటు సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 -23 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మంగళవారం నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో 6.5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని ఆర్థఇక శాఖ సర్వే అంచనా వేసింది.
ద్రవ్యోల్బణం...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు. అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు. రూపాయి క్షీణత ఇంకా కొనసాగే అవకాశముందని ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా వినియోగవస్తువుల ధరలు అధికంగానే ఉన్నాయని, దీంతో ద్రవ్యలోటు కూడా మరింత పెరగనుందని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. రూపాయి మరింత వత్తిడికి గురికావచ్చని పేర్కొంది.