Hemant Soren : హేమంత్ సోరెన్ కు బెయిల్ మంజూరు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది. ఆయన మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్నారు. భూకుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు జనవరి 31న అరెస్ట్ చేశారు. ఆయన అప్పటి నుంచి బిర్సాముండా జైలులో ఉన్నారు. అయితే ప్రాధమిక ఆధారాలను చూసినప్పుడు ఆయన నేరాలకు పాల్పడలేదని, బెయిల్ పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.
భూమి కుంభకోణంలో...
దీంతో హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్టయి జైలుకు వెళ్లడంతో ఆయన స్థానంలో జేఎంఎం సీనియర్ నేత చంపాయి సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హేమంత్ సోరెన్ దాదాపు ఆరు నెలల నుంచి జైలులోనే ఉన్నారు. రాంచీలోని 8.80 ఎకరాలకు సంబంధించిన భూకుంభకోణంలో సోరెన్ అరెస్టయ్యారు. బెయిల్ కోసం అనేక సార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అయితే ఈరోజు ఆయకు బెయిల్ లభించడంతో జేఎంఎం కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.