ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ అతిథిగా పాల్గొననున్నారు

Update: 2023-07-14 01:53 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది. ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దేశాధ్యక్షుడు మాక్రాన్ అత్యున్నత గౌరవ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శుక్రవారం జరిగే ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ అతిథిగా పాల్గొననున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేసినట్లు ఆ దేశ అధికారిక ప్రకటనలో తెలిపింది.

ఇదొక చారిత్రాత్మక ఘట్టమని ఫ్రాన్స్ అభివర్ణించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను అందజేశారు. ఫ్రాన్స్ లో సైనిక లేదా పౌరులకు సంబంధించిన అత్యున్నత గౌరవం. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారత ప్రధానిగా ప్రధాని మోదీ గుర్తింపు పొందారు. భారత ప్రజల తరపున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది, అక్కడ మాక్రాన్ ప్రధాని మోదీకి ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు. "ఫ్రాన్స్‌లో అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ లెజియన్ ఆఫ్ హానర్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించారు’’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు. గతంలో, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్‌ను ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులు, వ్యక్తులు అందుకున్నారు. వీరిలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్, మాజీ జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ-జనరల్ బౌట్రోస్ బౌట్రోస్-ఘాలీ తదితరులు ఉన్నారు.


Tags:    

Similar News