బంగారం కొనాలని అనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గగా

Update: 2023-08-17 02:30 GMT

గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ ఉన్నాయి. ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గగా.. వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. ఇటీవల కాలంలో పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్ని రోజుల నుంచి క్రమంగా దిగొస్తున్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.54,450 గా ఉండగా.. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర రూ.59,400 లుగా ఉంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.110 మేర ధర తగ్గింది. కిలో వెండి ధర రూ.200 మేర పెరిగి రూ.73,000 లుగా కొనసాగుతోంది.

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,600 లుగా ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,550 గా ఉంది. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.59,400 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,450, 24 క్యారెట్లు రూ.59,400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,950, 24 క్యారెట్ల ధర రూ.59,950 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,400 నమోదు అయింది.
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్ లో వెండి ధర రూ.76,200 గా నమోదైంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,200 ఉండగా.. ముంబైలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.76,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి రూ.72,000 గా నమోదైంది.


Tags:    

Similar News