ఎస్పీ బాలు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన తమిళనాడు సర్కార్

ప్రముఖ గాయకుడు దివంతగత ఎస్పీ బాలుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అరుదైన గౌరవం దక్కేలా చేశారు.

Update: 2024-09-26 07:32 GMT

 sp bala subrahmanyam

ఎస్సీ బాలు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. ఆయన గొంతు ప్రతి ఇంట్లో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి ఇంట్లో ఒక గొంతుకగా మారిన ఎస్పీ బాలు మృతి కరోనా కాలంలో ఎవరినీ కోలుకోకుండా చేసింది. ఆయన మృతి చిత్ర పరిశ్రమకే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలకు పెద్ద లోటుగా చెప్పాలి. ఆయనకు అభిమానులు ప్రతి కుటుంబంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో ఉదయం నుంచి వినిపించే భక్తిగీతాలతో పాటు ఆయన ఆలపించిన అనేక గీతాలు ఇప్పటికి అనేక మందిని కట్టిపడేస్తాయి. చాలా మందికి ఎస్పీబీ పాటలు ఒక చికిత్స లాంటిదంటారు. ఆయన పాటలు వింటూ నిద్రపోయే వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రతి నిత్యం మనలో ఒకడిగా ఉన్న ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మనకు దూరమై నాలుగేళ్లు కావస్తుంది.

నాలుగేళ్లవుతున్న తరుణంలో...
అయితే ఇందుకు తమిళనాడు ప్రభుత్వం మంచి బహుమతిని ఇచ్చింది. ఆయన కేవలం తెలుగు మాత్రమే కాదు. తమిళం, కన్నడం, మళయాళం, హిందీ వంటి పదహారు భాషాల్లో పాడిన ఎస్పీ బాలుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అరుదైన గౌరవం దక్కేలా చేశారు. ఎస్పీ బాలు కుమారుడు చరణ్ వినతిని పరిశీలించిన స్టాలిన్ వెంటనే ఆ ప్రతిపాదనకు అంగీకరించారు. చెన్నైలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెడుతున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఆయన పేరును మెయిన్ రోడ్‌కు పెట్టడం అభినందనీయమంటున్నారు. ఈ మేరకు స్టాలిన్ అధికారికంగా ప్రకటించడంతో ఎస్పీబీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇకపై కాందార్ నగర్ మెయిన్ రోడ్డును ఎస్పీ బాలసుబ్రహ్యణ్యంరోడ్డుగా పిలుస్తారు. ఆ రోడ్డుతో ఆయనకు కొన్నేళ్ల అనుబంధం ఉంది. ఆ రోడ్డులోనే ఆయన నివసిస్తుండటంతో ఆ మెయిన్ రోడ్డుకు ఆ పేరును పెడుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News