America : అమెరికాను వణికిస్తున్న హరికేన్లు.. అత్యవసర పరిస్థితి ప్రకటన

అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వైపు వేగంగా పయనిస్తుందని నిపుణులు చెబుతున్నారు

Update: 2024-09-26 07:06 GMT

hurricanes

అమెరికాను హరికేన్లు వణికిస్తున్నాయి. మెక్సికో తీరం నుంచి అమెరికాలోని ఫ్లోరిడా వైపు వేగంగా పయనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ హెలెనా హరికేన్ ఈరోజు మధ్యాహ్నానికి ఈశాన్య ప్రాంతంలోని తీరాన్ని తాకొచ్చని అంచనా వేస్తున్నారు. సహజంగా అమెరికాలో హరికేన్లు జూన్‌లో ప్రారంభమయి నవంబరు నెల వరకూ ఉంటాయి. ఈ నెలలో వీటి తీవ్రత అత్యధికంగా ఉంటుంది.

అతి వేగంగా గాలులు...
ఈ ఏడాది పదమూడు హరికేన్లు వస్తాయని ముందుగానే అంచనా వేశారు. హలెనా హరికేన్ తీవ్రతకు కాలిఫోర్నియా, జార్జియా, ఫ్లోరిడాలలో ఎమెర్జెన్సీని ప్రకటించారు. ప్రధానంగా 177 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని చెబుతున్నారు. సముద్రపు అలలు 20 అడుగులు ఎత్తున ఎగిసిపడతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అలెర్ట్ ప్రకటించారు. హెలెనా రాను రాను తీవ్రంగా మారుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Tags:    

Similar News