బంగారం ధరలు.. ఇంకాస్త తగ్గాయి

బంగారం ధరలు నేడు మరింత తగ్గాయి. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Update: 2023-08-18 03:00 GMT

బంగారం ధరలు నేడు మరింత తగ్గాయి. శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,020గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 350.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 380 తగ్గింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,170గా ఉంది. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,560లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,520 వద్ద కొనసాగుతోంది. ముంబై, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,020గా కొనసాగుతోంది.

వెండి ధరలు కూడా తగ్గాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర నేడు రూ. 72,500లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 500 తగ్గింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 75,700ల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,500గా ఉంది. చెన్నైలో రూ. 75,700గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 72,000 గా నమోదైంది.


Tags:    

Similar News