పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.350లు, కిలో వెండిపై రూ.200లు తగ్గింది

Update: 2022-04-05 01:28 GMT

బంగారాన్ని కొనుగోలు చేసే వారు ధరలను పెద్దగా పట్టించుకోరు. తమ వద్ద ఉన్న నగదుకు సరిపడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్పపడతారు. అందుకే బంగారం ధర పెరిగినా, తగ్గినా పెద్దగా వ్యాపారాలపై దాని ప్రభావం ఉండదు. అయితే ధర తగ్గిననప్పుడు మాత్రం కొంత చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో బంగారం ధర తగ్గినప్పడు కొనుగోలు చేయాలన్న ఆసక్తి రెంట్టింపు అవుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర పెరిగినప్పుడు కంటే స్వల్పంగా తగ్గినా కొనుగోళ్లలో పది శాతం తేడా ఉంటుందని వారు చెబుతున్నారు.

తగ్గిన ధరలు...
ఈరోజు దేశ వ్యాప్తంగా బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారంపై రూ.350లు, కిలో వెండిపై రూ.200లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,800 రూపాయలు ఉంది. అదే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,.140 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర స్వల్పంగా తగ్గడంతో 71,400 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News