పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం, వెండి ధరల నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-06-08 01:45 GMT

బంగారం పెట్టుబడిగా మారింది. అలాగే సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకూ అవసరం కూడా అయింది. దీంతో బంగారానికి డిమాండ్ పెరగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. నిన్న పెరిగిన బంగారం ధర నేడు కొంత తగ్గింది. అలాగే వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ధరల తగ్గుదలతో కొనుగోళ్లు మరింత ఎక్కువగా ఉంటాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం ఎప్పుడూ బంగారమే కాబట్టి ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేయడం మంచిదని వారు సూచిస్తున్నారు.

ధరలు ఇలా..

బంగారం, వెండి ధరల నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,600 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,930 రూపాయలుగా ఉంది. కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 67,700 రూపాయలుగా ఉంది. ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News