పసిడిప్రియులకు షాక్.. పెరిగిన ధర

దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.300లు పెరిగింది.

Update: 2022-06-10 02:01 GMT

ప్రపంచ వ్యాపంగా పసిడికి ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా దానిని భారత్ లో సంప్రదాయంగా కొనుగోలు చేస్తుంటారు. శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయకుండా ఉండరు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. తమ డబ్బులను మదుపు చేసుకునేందుకు కూడా బంగారాాన్ని కొనుగోలు చేస్తారు. పెట్టుబడిగా చూస్తున్నందునే బంగారం కొనుగోళ్లు భారత్ లో నిత్యం జరుగుతూనే ఉంటాయి. అందుకే బంగారానికి భారత్ లో అంత డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు కూడా బంగారం ధరపై ప్రభావాన్ని చూపుతుంటాయి.

వెండి కూడా...
దేశ వ్యాప్తంగా ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం పై రూ.300లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,310 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,950 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా పెరిగింది. నేడు కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 68,000 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News