షాక్...పుత్తడి మరింత ప్రియం

తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి

Update: 2022-04-08 01:48 GMT

బంగారం అంటేనే డిమాండ్ ఎక్కువ. తులమా? గ్రామా? అన్నది చూడరు. బంగారాన్ని కొనుగోలు చేశామా? లేదా? అన్నది సెంటిమెంట్ తో చూస్తారు. ప్రధానంగా భారత్ లో ఈ రకమైన భావనతో బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అందుకే బంగారం వన్నె తగ్గదు. డిమాండ్ తగ్గదు అన్న సామెత ఊరికే అనలేదు. బంగారంతో పాటు వెండిని కూడా సంప్రదాయ వస్తువుగా చూడటం వల్ల దీనికి కూడా ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతూ వస్తుంది.

ధరలు ఇలా.....
తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,000 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,370 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర 71,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News