గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. స్వల్పంగా తగ్గినా అది వినియోగదారులకు ఊరట కల్గించే అంశమే

Update: 2022-06-06 02:00 GMT

బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. స్వల్పంగా తగ్గినా అది వినియోగదారులకు ఊరట కల్గించే అంశమే. డిమాండ్ అధికంగా ఉన్నా ధరలు తగ్గడం పట్ల వినియోగదారులు సయితం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోళ్లు సహజంగా సమ్మర్ సీజన్ లో ఎక్కువగా ఉంటాయి. పెళ్లిళ్లతో పాటు వివిధ ఫంక్షన్లు ఉండటం కారణంగా బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువగా ఉంటారు. బంగారం ధరలు హెచ్చు తగ్గులు మామూలే అయినా వరసగా రెండు రోజుల నుంచి తగ్గుతుండటం గుడ్ న్యూస్ గానే చెప్పుకోవాలి.

ధరలు ఇలా....
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 52,090 రూపాయాలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 47,740 రూపాయలుగా ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి హైదరాబాద్ మార్కెట్ లో 67,500 రూపాయలుగా ఉంది. అయితే మార్కెట్ లో ధరల హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News